మలుపు.. మృత్యు పిలుపు
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:28 AM
మండలంలోని బెలుం గ్రామ సమీపంలో మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి
కనిపించని హెచ్చరిక బోర్డులు
కొలిమిగుండ్ల, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బెలుం గ్రామ సమీపంలో మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. అనంతపురం - అమరావతి ఎల్‌హెచ్ 544డీ ప్రధాన రహదారిలో బెలుం బస్టాండ్ నుంచి నంద్యాల మార్గంలో మలుపు పక్కనే గని గుంతలు ఉన్నాయి, గతంలో పలుమార్లు వాహనాలు గుంతల్లో పడిన ఘటనలు ఉన్నాయి. అవతలివైపు వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బెలుం నుంచి బెలుం గుహాలకు వెళ్లే రహదారిలో కూడా ఇదే పరిస్థితి. రహదారి పక్కనే హెచ్చరిక బోర్డులు, సూచీకలు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి సమయాల్లో ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుని వాహనచోదకులు మృతిచెందుతున్నారు.