ఆదమరిస్తే అంతే
ABN , Publish Date - Mar 23 , 2026 | 12:03 AM
మండలంలోని కడివెళ్ల, గుడికల్లు గ్రామాల్లో ప్రధాన రహదారులు ప్రమాదకరంగా మారాయి. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణాలు చేస్తుంటాయి
ప్రమాదకరంగా కవివెళ్ల, గుడికల్లు రోడ్లు
ఎమ్మిగనూరు రూరల్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కడివెళ్ల, గుడికల్లు గ్రామాల్లో ప్రధాన రహదారులు ప్రమాదకరంగా మారాయి. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణాలు చేస్తుంటాయి. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతం నుంచి మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వెళ్లే భక్తులు ఈ రహదారి గుండానే ప్రయాణం చేస్తుంటారు. ఈ దారి సింగిల్ దారి కావడంతో ప్రమాదాలు జరుగుతునే ఉంటాయి. కడివెళ్ల మోడల్ స్కూల్ సమీపంలోని ప్రధాన రహదారి ఓవైపు కోతకు గురైంది. గుడికల్లు గ్రామంలోని మలుపు వద్ద రోడ్డుపై భారీ గుంత పడింది. ఏ మాత్రం వాహనదారులు ఆదమరిచి ప్రయాణం చేసినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.