Share News

ప్రమాద ప్రయాణం

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:30 AM

పొట్టకూటి కోసం పనులకు వెళ్లే కూలీలు అత్యంత ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.

ప్రమాద ప్రయాణం
ఆటో ట్రాలీలో టాపుపై ప్రయాణిస్తున్న కూలీలు

కొలిమిగుండ్ల, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : పొట్టకూటి కోసం పనులకు వెళ్లే కూలీలు అత్యంత ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఆటోల్లో పరిమితికి మంచి ప్రయాణిసూత ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా వాని తీరు మారడంలేదు. మండలంలోని గ్రామాల నుంచి ప్రతి రోజూ సుమారు వెయ్యి మంది కూలీలు ఇలా అత్యంత ప్రమాదకరంగా ఆటోల్లో పొలం పనులకు వెళుతున్నారు. కూలి పనులకు వెళుతున్నారు. తాము పలుమార్లు అవగాహన కల్పిస్తున్నా కూలీలు, ఆటో డ్రైవర్లు పట్టించుకోవడంలేదని పోలీసులు అంటున్నారు. రవాణా శాఖ, పోలీసు అధికారులు ఇందుకు ప్రత్యామ్నాయం ఆలోచించాల్సి ఉంది.

Updated Date - Mar 01 , 2026 | 12:30 AM