Share News

ఆదమరిస్తే అంతే!

ABN , Publish Date - May 13 , 2026 | 12:17 AM

హైదరాబాద్‌-బెంగళూరు 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. మండలంలోని ప్యాపిలి, వెంగళాంపల్లి, పోతుదొడ్డి, ఏనుగమర్రి గ్రామాల వీదుగా దాదాపు 20కి.మీ. మేర జాతీయ రహదారి ఉంది. హైదరాబాద్‌ నుంచి బెంగుళూరు, ఇతర రాష్ట్రాలకు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

ఆదమరిస్తే అంతే!

జాతీయ రహదారిపై గుంతలు..

భారీ వాహనాలకు పొంచి ఉన్న ప్రమాదం

ప్యాపిలి, మే 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-బెంగళూరు 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. మండలంలోని ప్యాపిలి, వెంగళాంపల్లి, పోతుదొడ్డి, ఏనుగమర్రి గ్రామాల వీదుగా దాదాపు 20కి.మీ. మేర జాతీయ రహదారి ఉంది. హైదరాబాద్‌ నుంచి బెంగుళూరు, ఇతర రాష్ట్రాలకు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వాహనాలు 100 నుంచి 120కి.మీ. వేగంతో వెళుతుంటాయి. అయితే రహదారిపై గుంతలు ఉండటంతో ఏమాత్రం ఆదమరిచినా ప్రమాదం పొంచి ఉంది. జాతీయ రహదారి అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - May 13 , 2026 | 12:18 AM