మోదీ విధానాలు దేశానికి ప్రమాదం
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:43 PM
కేంద్రంలో నరేంద్రమోదీ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ప్రమాదకరంగా మారాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక జీవో నంబర్ 590, 847 కాపీలను బుధవారం పత్తికొండలో సీపీఐ నాయకులు భోగి మంటల్లో వేసి దహనం చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య
పత్తికొండ టౌన్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో నరేంద్రమోదీ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ప్రమాదకరంగా మారాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక జీవో నంబర్ 590, 847 కాపీలను బుధవారం పత్తికొండలో సీపీఐ నాయకులు భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలకమైన ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించే పనిలో కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజాసాహెబ్, మండల కార్యదర్శి కారుమంచి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పత్తికొండలో జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, సీఐటీయూ మండల కార్యదర్శి రవిచంద్ర పాల్గొన్నారు.
‘ఉపాధి’ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర
ఆలూరు, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నిందని వ్యవసాయ సంఘం జిల్లా నాయకుడు భూపేష్ ఆరోపించారు. బుధవారం పట్టణంలోని సిద్దేశ్వర కాలనీలో జీ రాంజీ జీవోలను భోగి మంటల్లో దహనం చేశారు. సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె.భూపేష్ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతుల్లోనే కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి రామాంజనేయులు, సిద్దేశ్వర కాలనీశాఖ కార్యదర్శి సిద్ధలింగ, ఏఐటీయూసీ నాయకులు రంగన్న, రైతు సంఘం నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, చాపల గోపాల్, ఎస్‌ఎస్ బాషా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తులసమ్మ, లకి్క్ష, నరసమ్మ, నాగేశ్వరమ్మ, నరసన్న, బాషా, పులి పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని పాత పేరుతోనే కొనసాగించాలని కోరుతూ సీపీఎం నాయకులు హనుమంతు ఆధ్వర్యంలో జీవో కాపీలను సంక్రాంతి భోగి మంటల్లో దహనం చేశారు.
దేవనకొండ, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఉపాధి కూలీలకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీ రాంజీ బిల్లు పత్రులను సీపీఐ, సీపీఎం నాయకులు భోగిమంటల్లో దహనం చేశారు. బుధవారం సీపీఐ నాయకుడు మద్దిలేటిశెట్టి, సీపీఎం నాయకుడు వీరశేఖర్ మాట్లాడుతూ గ్రామాల్లో వలసల నివారణకు, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. సీపీఐ మండల కార్యదర్శి నర్సారావ్, సీపీఎం నాయకులు మహబుబ్‌బాష, శ్రీనివాసులు పాల్గొన్నారు.
తుగ్గలి, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధి పథకంలో మహాత్ముడి పేరు తొలగించడం అన్యాయం అని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నబీ రసూల్ అన్నారు. బుధవారం భోగి పండగ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. ఉపాధి హామీ పథకం పేరు జీరామ్‌జీగా మార్చిన ప్రభుత్వ పత్రాలను రామలింగాయపల్లెలో భోగి మంటల్లో వేసి కాల్చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.