Share News

పడిపోతున్నా .. పట్టించుకోరా?

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:56 PM

మండలంలోని మీర్జాపురం గ్రామంలో విద్యుత్‌ స్తంభాలు శిథిలమై పడిపోతున్నాయి. స్తంభాలు పొలాల్లో కూలిపోతుండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు

పడిపోతున్నా .. పట్టించుకోరా?
మీర్జాపురం పొలాల్లో ఒరిగిపోయిన విద్యుత్‌ స్థంభం

మీర్జాపురంలో విద్యుత్‌ స్తంభాల దుస్థితి

కొలిమిగుండ్ల, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మీర్జాపురం గ్రామంలో విద్యుత్‌ స్తంభాలు శిథిలమై పడిపోతున్నాయి. స్తంభాలు పొలాల్లో కూలిపోతుండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. కొలిమిగుండ్ల సబ్‌స్టేషన్‌ నుంచి, పొలాల్లో విద్యుత్‌ లైను ఏర్పాటు చేశారు. అయితే సుమారు 6కు పైగా స్థంభాలు ఒరిగిపోయాయి. ఎప్పుడేం జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు చోటుచేసుకోకముందే విద్యుత్‌ అధికారులు స్పందించి, స్తంభాలను సరిచేయాలని రైతులు, గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Mar 31 , 2026 | 11:56 PM