Share News

మానవ అక్రమ రవాణాను అరికట్టండి

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:41 AM

మానవ అక్రమ రవాణాను అధికారులు అరికట్టేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవా లని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు.

మానవ అక్రమ రవాణాను అరికట్టండి
ప్రసంగిస్తున్న లీలా వెంకట శేషాద్రి

న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి

కర్నూలు లీగల్‌, జూలై 30(ఆంధ్రజ్యోతి): మానవ అక్రమ రవాణాను అధికారులు అరికట్టేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవా లని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు. గురువారం మానవ అక్రమ రవాణా ని వారణ దిన గోల్డెన జూబ్లీడే సందర్బంగా స్థానిక న్యాయ సేవా సదన భవనలో ఓ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అత్యంత దు ర్మార్గమైన చర్య అని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు. మానవ అక్రమ రవాణాపై పోస్టర్‌ను ఆవిష్కరించి స్థానిక జిల్లా కోర్టు ఆవరణం నుంచి పాతబస్టాండు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ వెంకటేశ్వర్లు, డీసీపీవో శారద, చైల్డ్‌ వెల్ఫేర్‌ మెంబర్‌ సుధాకర్‌, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స కౌన్సిల్‌ శివరామచంద్రరావు, రాయపాటి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 12:41 AM