వాతావరణానికి అనుగుణంగా సాగు చేయాలి
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:32 AM
వాతావరణ మార్పులను తట్టుకునే స్థిర వ్యవసాయ పద్దతులను తెలుసుకొని వాటికి అనుగుణంగా పంటలు సాగుచేయాలని జిల్లా వనరుల కేంద్రం అధికారి సునీత, ఎమ్మిగనూరు ఏడీఏ మహ్మద్ ఖాద్రీలు రైతులకు సూచించారు. గురువారం పట్టణంలోని ఏడీఏ కార్యాలయంలో ఏఓ శివశంకర్ ఆద్వర్యంలో స్థిర వ్యవసాయ పద్దతులపై రైతులకు శిక్షణకార్యక్రమం నిర్వహించారు
ఎమ్మిగనూరు, జూలై 2(ఆంధ్రజ్యోతి): వాతావరణ మార్పులను తట్టుకునే స్థిర వ్యవసాయ పద్దతులను తెలుసుకొని వాటికి అనుగుణంగా పంటలు సాగుచేయాలని జిల్లా వనరుల కేంద్రం అధికారి సునీత, ఎమ్మిగనూరు ఏడీఏ మహ్మద్ ఖాద్రీలు రైతులకు సూచించారు. గురువారం పట్టణంలోని ఏడీఏ కార్యాలయంలో ఏఓ శివశంకర్ ఆద్వర్యంలో స్థిర వ్యవసాయ పద్దతులపై రైతులకు శిక్షణకార్యక్రమం నిర్వహించారు. సునీత మాట్లాడుతూ ఎల్‌నినో, కరువు, అకాల వర్షాలు, వడగాల్పులు వంటి వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించి పంట నష్టం లేకుండా ఆధాయం పెంచుకోవాలన్నారు. ప్రధానంగా భూసారాన్ని పెంచేందుకు సేంద్రియ కర్బనం పెంచితే కరువు తట్టుకుంటుందన్నారు. ఎకరాకు 2టన్నులు పశువుల ఎరువును వేయాలని, పత్తి, మిరప, కూరగాయల్లో 40శాతం నీరు ఆదా చేసుకునేందుకు బిందు సేద్యం చేయాలని డిమాండ్ చేశారు. బిందు సేద్యం కోసం సబ్సిడీపై పరికరాలు ప్రభుత్వం అందిస్తుంద ని తెలిపారు. తేమ నిలువ ఉంచటానికి ఎకరానికి ఒక నీటి కుంటను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నేలలో సూక్ష్మజీవులు, పెరిగి వేరు వ్యవస్థ బలంగా ఉండేందుకు జీవామృతం, ఘనజీవామృతం పద్ధతులను పాటించాలన్నారు. అలాగే కరువు వస్తే కంది, ఆముదం, కొర్ర, సజ్జ పంటలను, వర్షం ఎక్కువైతే వరి బదులు మొక్కజొన్న పంటను సాగుచేయాలన్నారు. 50 నుంచి 60 ఎంఎం వర్షా పడ్డాకే విత్తనం వేయాలన్నారు. అంతర్ పంటలను వేసుకోవాలన్నారు. ఆత్మ బీటీఎం రామాంజిని, ఎంపీఈవో అనూష, రైతులు పాల్గొన్నారు.