తుంగభద్రపై నేడు కీలక భేటీ..
ABN , Publish Date - Nov 17 , 2026 | 11:14 PM
తుంగభద్ర ప్రాజెక్టు, విజయనగర కాలువల నీటి పంపిణీ భవిష్యత్‌ను నిర్ణయించే అత్యంత కీలక సమావేశం నేడు జరగనుంది. 2026-27 నీటిపారుదల సంవత్సరానికి సంబంధించి ప్రస్తుత ఖరీఫ్ (వర్షాకాలం) మిగిలిన కాలంలో నీటి వినియోగం, తదుపరి సాగు అవసరాలపై చర్చించేందుకు 128వ నీటిపారుదల సలహా కమిటీ (ఐసీసీ) భేటీని అధికారులు ఏర్పాటు చేశారు.
బెంగళూరు వికా్‌స సౌధలో అధికారుల సమావేశం
కాలువలకు నీటి విడుదల పొడిగింపుపై నిర్ణయం వెలువడే అవకాశం
ఆదోని, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర ప్రాజెక్టు, విజయనగర కాలువల నీటి పంపిణీ భవిష్యత్‌ను నిర్ణయించే అత్యంత కీలక సమావేశం నేడు జరగనుంది. 2026-27 నీటిపారుదల సంవత్సరానికి సంబంధించి ప్రస్తుత ఖరీఫ్ (వర్షాకాలం) మిగిలిన కాలంలో నీటి వినియోగం, తదుపరి సాగు అవసరాలపై చర్చించేందుకు 128వ నీటిపారుదల సలహా కమిటీ (ఐసీసీ) భేటీని అధికారులు ఏర్పాటు చేశారు. బెంగళూరులోని వికాస్ సౌధ, మూడో అంతస్తు, గది నవంబరు 313లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. కర్ణాటక వెనుకబడిన తరగతుల సంక్షేమం, కన్నడ, సాంస్కృతిక శాఖల మంత్రి, కొప్పళ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఐసీసీ చైర్మన్ శివరాజ్ ఎస్.తంగడగి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ మేరకు తుంగభద్ర ప్రాజెక్టు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఐసీసీ సభ్య కార్యదర్శి ఎస్.బి. మల్లిగవాడ అధికారికంగా సమావేశ నోటీసును జారీ చేశారు.
ఆయకట్టు రైతుల్లో ఉత్కంఠ
జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడం, ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోవడంతో కాలువలకు నీటి సరఫరా నిలిపివేతపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. చేతికొచ్చిన పంటలను కాపాడుకునేందుకు కనీసం నవంబరు 30 లేదా డిసెంబరు వరకు కాలువలకు నీరు విడుదల చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి సమావేశంలో కాలువలకు నీటి విడుదల పొడిగింపు, తాగునీటి అవసరాల కోసం నీటి నిల్వ, తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కీలక భేటీకి కొప్పళ, రాయచూరు, విజయనగర, బళ్లారి జిల్లాల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు హాజరుకానున్నారు.