పర్యాటకుల సందడి
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:06 AM
వేసవి సెలవులు ముగుస్తుం డటంతో గాజులదిన్నె ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది.
సెలవులు ముగుస్తుండడంతో
జీడీపీకి పెరిగిన సందర్శకుల తాకిడి
గోనెగండ్ల, జూన్ 7(ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులు ముగుస్తుం డటంతో గాజులదిన్నె ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. పాఠశా లలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పర్యాటకులు ప్రాజెక్టు వద్దకు వచ్చి సందడి చేస్తున్నారు. ప్రాజెక్టులో ఈత కొడుతూ సరదాగా గడిపా రు. పర్యాటకులు ఫొటోలు, వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సా హంగా గడిపారు.