Share News

భక్తజన సంద్రం.. శ్రీగిరి క్షేత్రం

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:18 PM

శ్రీగిరి క్షేత్రం భక్త జన సంద్ర మైంది. వారాంతపు సెలవులతో పాటు తెలంగాణ అటవీ ప్రాంతంలో జరుగుతున్న సలేశ్వరం జాతరను సందర్శించుకున్న వారంతా శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటున్నారు.

భక్తజన సంద్రం.. శ్రీగిరి క్షేత్రం
అలంకార దర్శనం కోసం కంపార్టుమెంట్లో ఉన్న భక్తులు

అందరికీ సంతృప్తికర అలంకార దర్శనాలు

ఎండను తట్టుకునేలా భక్తులకు సౌకర్యాలు

శ్రీశైలం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): శ్రీగిరి క్షేత్రం భక్త జన సంద్ర మైంది. వారాంతపు సెలవులతో పాటు తెలంగాణ అటవీ ప్రాంతంలో జరుగుతున్న సలేశ్వరం జాతరను సందర్శించుకున్న వారంతా శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో స్నానాలు చేసుకుని ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులుదీరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున రోజుకు రెండుసార్లు మాత్రమే గర్భాలయ స్పర్శ దర్శనాలు కల్పిస్తూ అందరికీ అలం కార దర్శనాలు అందుబాటులో ఉంచారు. దేవస్థానం అన్నదాన భవనంలో ఉదయం నుంచి రాత్రి వరకు అల్పా హారాలు, భోజనాలు వడ్డించడంతోపాటు క్యూలైన్లు, కంపా ర్టుమెంట్లలో వేచి ఉండే భక్తులకు కావలసిన పాలు, నీళ్లు, పొంగలి, పులిహోర, దద్దోజ నం వంటివి శివసేవకుల సహకారంతో అందిస్తున్నారు. పెరిగిపోత్ను ఎండ లకు తట్టుకునేలా భక్తులకు అవసరమైన సౌకర్యాలను నిత్యం పర్య వేక్షిస్తూ తగు ఏర్పాట్లను ఇంజనీరింగ్‌ అధికారులు సమకూరు స్తున్నారు. దర్శన సమయాల్లో భక్తులు ఆలయ సిబ్బంది అధికారులకు సహకరిం చాలని ఈవో శ్రీనివాసరావు కోరారు.

Updated Date - Apr 04 , 2026 | 11:18 PM