Share News

శ్రీగిరిపై భక్తుల సందడి

ABN , Publish Date - May 25 , 2026 | 12:29 AM

శ్రీశైల శిఖరానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో ఆదివారం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

శ్రీగిరిపై భక్తుల సందడి
భక్తులకు వడ్డిస్తున్న ఈవో శ్రీనివాసరావు

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

దర్శనానికి మూడు గంటల సమయం

శ్రీశైలం, మే 24 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల శిఖరానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో ఆదివారం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో క్షేత్ర వీధులన్నీ భక్తులతో కిక్కిరిశాయి. ఎటు చూసినా జనరద్దీ కనిపించింది. స్వామిఅమ్మవార్ల దర్శనాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాల క్యూలైన్ల ద్వారా వెళ్లిన వారికి మూడు గంటల సమయం పట్టగా రెండు విడతలు మాత్రమే వీఐపీ బ్రేక్‌ స్పర్శ దర్శనాలకు ఆలయ అధికారులు అవకాశం కల్పించారు. కంపార్టుమెంట్లు క్యూలైన్లలో దర్శనానికి వేచి ఉన్న భక్తులకు వేడి పాలు, చల్లని మజ్జిగ, మంచినీరు, అల్పాహారం అందించారు. అన్నదాన భవనంలో శుచిశుభ్రత ప్రమాణాలతో తయారైన వంటకాలను ఈవో శ్రీనివాసరావు స్వయంగా భక్తులకు వడ్డించారు. దర్శనానంతరం బయటకు వచ్చిన భక్తులతో అభిప్రాయాలను తెలుసుకున్నారు.

Updated Date - May 25 , 2026 | 12:29 AM