శ్రీ మఠం ప్రాంగణంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:21 AM
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం దర్శనార్థం వచ్చిన భక్తులతో సందడి గా మారింది. ఆదివారం సెలవు రోజు కావటంతో ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు.
మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు
మంత్రాలయం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం దర్శనార్థం వచ్చిన భక్తులతో సందడి గా మారింది. ఆదివారం సెలవు రోజు కావటంతో ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం, అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్ కారిడార్, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, తుంగభద్ర నదితీరం భక్తులతో కోలాహలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆశీస్సులు పొందారు. సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు హైవే రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.