Share News

శ్రీశైలంలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:45 PM

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

శ్రీశైలంలో భక్తుల రద్దీ
దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు

ప్రతి ఒక్కరికీ సంతృప్తికర దర్శనం

ఈవో శ్రీనివాసరావు

శ్రీశైలం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. శని, ఆదివారం ప్రభుత్వ సెలవు రోజులు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు స్వామి, అమ్మవార్లను సుమారు 50 వేల మంది అలంకార దర్శనాలు చేసుకున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శ్రావణమాసంలో క్షేత్ర సందర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ, క్యూలైన్లు కంపార్టుమెంట్లలో అల్పాహారం, మంచినీరు, పాలు, మజ్జిగ ఇవ్వడానికి ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Updated Date - Aug 16 , 2026 | 11:45 PM