Share News

శ్రీశైలంలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:10 PM

శ్రీశైల క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం ప్రభుత్వ సెలవుతోపాటు వారాంతపు సెలవులు కలిసి రావడంతో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల నుండే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులతో క్షేత్ర పురవీధులు కిక్కిరిసి పోయాయి.

శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంలో దర్శనానికి వెళ్తున్న భక్తులు

వసతి గదులు లేక ఇబ్బందులు

భక్తులు దర్శన సమయాల్లో సిబ్బందితో సహకరించాలన్న ఈవో

శ్రీశైలం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం ప్రభుత్వ సెలవుతోపాటు వారాంతపు సెలవులు కలిసి రావడంతో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల నుండే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులతో క్షేత్ర పురవీధులు కిక్కిరిసి పోయాయి. సాయంత్రం ఒక్కసారిగా కుటుంబసభ్యులతో వచ్చిన భక్తులకు తగిన వసతి గదులు లభించక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ముందుగా నమోదు చేసుకున్న వారికి దేవస్థానం వసతి సముదాయాల్లో వసతి గదులను కేటాయించగా అప్పటికప్పడు సిఫార్సులతో వచ్చిన వారికి గదులు కేటాయించేందుకు ఆలయ అధికారులు అవస్థలుపడ్డారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శని ఆది సోమ వారాల్లో గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలు, వీఐపీ బ్రేక్‌ స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా రద్దు చేశారు. ఆన్‌లైన్‌లో స్పర్శ దర్శనాలు నమోదు చేసుకు న్న వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అందరికీ అలంకార దర్శనం కల్పిస్తూ ఉభయ దేవాలయాల్లో స్వామి, అమ్మ వార్ల సంతృప్తికర దర్శనాలు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుం టున్నట్లు ఈవో తెలిపారు. దర్శనార్థం క్యూలైన్ల వద్దకు చేరుకున్న భక్తులు ఆలయ సిబ్బందికి, అధికారులకు సహకరించవలసిందిగా ఈవో కోరారు.

Updated Date - Jun 26 , 2026 | 11:10 PM