Share News

శ్రీశైలంలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:16 PM

జ్యోతిర్లింగ శక్తిపీఠ మైన శ్రీశైల మహా క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా అంచనాకు మించి క్షేత్రానికి చేరుకుంటున్నారు.

శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంలో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు

శ్రీశైలం, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): జ్యోతిర్లింగ శక్తిపీఠ మైన శ్రీశైల మహా క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా అంచనాకు మించి క్షేత్రానికి చేరుకుంటున్నారు. శనివారం సాయం త్రం క్షేత్ర పురవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సుమారు 70వేల మంది దర్శనానికి వచ్చినట్లు సమాచారం. ఆన్‌లైన్‌ ద్వారా ముందుగా వసతి గదులను నమోదు చేసుకున్న వారు మినహాయించి మిగతా యాత్రికులు వసతి గదులు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెల్లవారుజాము నుంచి ఉభయ దేవాలయాల్లో యథావిధిగా దర్శనాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వీఐపీ బ్రేక్‌ స్పర్శ దర్శనాలు కేవలం రెండు విడతలు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నందున సిఫార్సు లేఖలతో వచ్చే వారి సంఖ్య గణనీ యంగా పెరిగింది. ఆలయ నిబంధనల ప్రకారం రెండు రోజులు ముందుగా సంబంధిత శాఖల నుంచి భక్తుల పూర్తి వివరాలతో సిఫార్సు లేఖలు దేవస్థానం కాల్‌ సెంటర్‌కు పంపించడంతో తగిన దర్శనాలను కల్పించడానికి ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తారు. అందుకు విరుద్దంగా అప్పటికప్పుడు వచ్చే సిఫార్సుల వల్ల వసతి గదులు, దర్శన టికెట్లు కేటాయించేందుకు అధికారులు అవస్థలు పడుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన విధానాలు ఏర్పాటు చేయడంతో తమకు కేటాయించిన టికెట్ల స్టాట్‌ టైమింగ్‌ ప్రకారం క్యూలైన్ల వద్దకు చేరుకుని ఆలయ సిబ్బందికి సహకరించాలని ఈవో శ్రీనివాసరావు కోరారు.

Updated Date - Jun 13 , 2026 | 11:16 PM