Share News

శ్రీశైలంలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:03 AM

వేసవి సెలవులు ముగియ నుండటంతో వారం నుంచి శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది.

శ్రీశైలంలో భక్తుల రద్దీ
ఆలయ ధ్వజస్తంభం వద్ద దర్శనానికి వెళ్తున్న భక్తులు

అందరికీ సంతృప్తికర దర్శనం కోసం చర్యలు - ఈవో శ్రీనివాసరావు

శ్రీశైలం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులు ముగియ నుండటంతో వారం నుంచి శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి నదీ స్నానాలు చేసుకుని తలనీలాలు సమర్పిం చుకుంటున్న భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూలైన్ల కంపార్టుమెంట్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. రోజుకు రెండు పర్యాయాలు మాత్రమే వీఐపీ బ్రేక్‌ స్పర్శ దర్శనాలు కల్పిస్తూ భక్తులందరికీ ఉభయ దేవాలయాల్లో అలంకార దర్శనాలు కల్పించారు. అందరూ సంతృప్తికరంగా దర్శించుకొనేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. దేవ స్థానం ఏర్పాటు చేసిన వసతులను భక్తులు వినియోగించుకుంటూ దర్శన సమయాల్లో ఆలయ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఆన్‌లైన్‌, మన మిత్ర వాట్సప్‌ ద్వారా పలు ఆర్జిత సేవలు, లడ్డూ ప్రసాదాలు, కళ్యాణకట్ట, వసతి గదులను ముందుగా నమోదు చేసుకుని సమయాన్ని ఆదా చేసుకోవలసిందిగా సూచించారు.

Updated Date - Jun 08 , 2026 | 12:03 AM