శ్రీశైలంలో భక్తుల సందడి
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:07 AM
శ్రీశైల మహా క్షేత్రం భక్తుల సందర్శనతో సందడిగా మారింది.
దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
అందరికీ స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనం
శ్రీశైలం, మే 31 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా క్షేత్రం భక్తుల సందర్శనతో సందడిగా మారింది. ఆదివారం తెల్లవారుజాము నుండి పాతాళగంగలో పుణ్య స్నానాలు చేసుకుని తలనీలాలు మొక్కులుగా సమర్పించుకున్నారు. ఉభయ దేవాలయాల దర్శనాల కోసం సర్వ దర్శ నం భక్తులకు నాలుగు గంటల సమయం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలకు రెండు గంటలు, స్పర్శ దర్శనం ముందస్తుగా ఆన్‌లైన్ టిక్కెట్ పొందిన వారికి గంట సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు. క్యూలైన్‌లో వేచి ఉండే భక్తులకు పాలు, మంచి నీరు, అల్పాహారం, మజ్జిగ శివసేవకుల సహాయంతో అందిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.