శ్రీశైలంలో భక్తుల సందడి
ABN , Publish Date - May 23 , 2026 | 11:32 PM
శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు వస్తున్న యాత్రికులతో క్షేత్రమంతా సందడిగా మారింది.
శ్రీశైలం, మే 23 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు వస్తున్న యాత్రికులతో క్షేత్రమంతా సందడిగా మారింది. వారాంతం, వేసవి సెలవులు కలసి రావడంతో గర్భాలయ స్పర్శ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. శనివారం తెల్లవారుజామున తలనీలాలు సమర్పించుకుని కృష్ణమ్మ ఒడిలో నదీ స్నానాలు చేసి పసుపు కుంకుమలతో కృష్ణమ్మకు సారెలు సమర్పించు కున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనాలకు వీఐపీ టిక్కెట్టు పొందిన వారికి గంట సమయం, అతి శీఘ్ర దర్శనం వారికి రెండు గంటలు, శీఘ్ర, ఉచిత దర్శ నం వారికి మూడు గంటలకు పైగా ఉభయ దేవాలయాలలో దర్శనాలు ముగిశాయని ఆలయ అధికారులు చెప్పారు. దర్శనానంతరం భక్తులకు భోజన ప్రసాదం అందిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.