Share News

శ్రీశైలంలో భక్తుల సందడి

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:30 PM

శ్రీశైల క్షేత్రమంతా శివపారవశ్యంతో ఓలలాడుతోంది.

శ్రీశైలంలో భక్తుల సందడి
స్వామి,అమ్మవార్ల దర్శనానికి క్యూలో వేచివున్న భక్తులు

పాతాళగంగలో పుణ్యస్నానాల రద్దీ

ఉభయ దేవాలయాల్లో దర్శనానికి 2 గంటలు

కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

శ్రీశైలం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రమంతా శివపారవశ్యంతో ఓలలాడుతోంది. శనివారం ప్రభుత్వ సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల యాత్రికులే కాకుండా ఉత్తర ప్రాంత రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో స్వామి, అమ్మవార్ల దర్శనార్థం వచ్చారు. తెల్లవారుజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసుకుని క్యూలైన్లలో బారులు దీరారు. సర్వ దర్శనానికి 4 గంటలు, శీఘ్ర దర్శనానికి 3 గంటలు, అతిశీఘ్ర దర్శనానికి 2 గంటలు, వీఐపీ బ్రేక్‌ స్పర్శ దర్శనానికి గంట సమయం పట్టింది. శని, ఆది, సోమవారాల్లో గర్భాలయ అభిషేకాలతోపాటు సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలను తాత్కాలికంగా నిలిపివేసి స్పర్శ దర్శనాలు నిర్ణీత టైం స్లాట్‌ ప్రకారం కల్పించినట్లు అలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అనుబంధ ఆలయాలున్న పాలధార పంచదార, హఠకేశ్వరం, శిఖరేశ్వర ప్రాంతాలు కూడా భక్తులతో కిటకిటలాడాయి.

Updated Date - Mar 21 , 2026 | 11:30 PM