శ్రీశైలంలో భక్తుల సందడి
ABN , Publish Date - Feb 23 , 2026 | 12:12 AM
శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో క్షేత్రమంతా సందడిగా మారింది. వారాంతపు సెలవులు పూర్తయినప్పటికీ గర్భాలయ స్పర్శ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి భక్తులు క్షేత్రానికి చేరుకుం టూనే ఉన్నారు.
స్వామి, అమ్మవార్లకు పుష్ప పల్లకీ సేవ
శ్రీశైలం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో క్షేత్రమంతా సందడిగా మారింది. వారాంతపు సెలవులు పూర్తయినప్పటికీ గర్భాలయ స్పర్శ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి భక్తులు క్షేత్రానికి చేరుకుం టూనే ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున తలనీలాలు సమర్పిం చుకుని కృష్ణమ్మ ఒడిలో నదీ స్నానాలు చేసి పసుపు కుంకుమలతో కృష్ణమ్మకు సారెలు సమర్పించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనా లకు వీఐపీ అలంకార దర్శనం టిక్కెట్టు పొందిన వారికి గంట, అతి శీఘ్ర దర్శనంలో రెండు గంటలు, శీఘ్ర, ఉచిత దర్శనం గంటన్నర సమయం పడుతోంది. సామాన్య భక్తులు క్యూలైన్‌లలో పాలు, మంచి నీరు, అల్పాహారం, పిల్లలకు బిస్కెట్లు అందిస్తున్నారు. దర్శనానంతరం భోజన ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. సాయంత్రం పుష్ప పల్లకిలో స్వామి, అమ్మవార్ల ఉత్సమూర్తులను ఊరేగించారు.