మహానందిలో భక్తుల రద్దీ
ABN , Publish Date - May 18 , 2026 | 12:07 AM
మహానంది పుణ్య క్షేత్రం వేలాది మంది భక్తులతో ఆదివారం కిటకిటలాడింది.
మహానంది, మే 17 (ఆంధ్రజ్యోతి): మహానంది పుణ్య క్షేత్రం వేలాది మంది భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. వీకెండ్‌ను పురస్క రించు కొని తెలుగు రాష్ర్టాల నుండే కాక కర్ణాటక, మహారాష్ట్ర, తమిళ నాడు రాష్ర్టాల నుండి భక్తులు శనివారం సాయంత్రమే క్షేత్రానికి చేరుకొ ని ఆల య పరిస రాల్లోని వసతి గృహాలతో పాటు ప్రైవేట్ లాడ్జీల్లో భక్తు లు వసతి పొం దారు. తెల్లవారుజామున 5 గంటల నుండే ఆలయ ప్రాం గణంలోని కోనేర్లల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం తో ఆలయ పరిసరా ల్లో దేవస్ధానం ఏర్పాటు చేసిన చలువ పందిళ్ళ కింద సేదతీరారు.