మంత్రాలయంలో భక్తుల సందడి
ABN , Publish Date - May 18 , 2026 | 12:11 AM
రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం మఠం సందడిగా మారింది.
మంత్రాలయం, మే 17(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం మఠం సందడిగా మారింది. ఆదివారం సెలవుదినం కావటంతో దక్షిణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహా ముఖ ద్వా రం, మధ్వమార్గ్ కారిడార్, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, నదీతీరం భక్తులతో కోలాహలంగా మారింది. గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.