మంత్రాలయంలో భక్తుల సందడి
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:27 PM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం గురువారం భక్తులతో కిక్కిరిసింది. ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహరాష్ట్ర నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు.
మంత్రాలయం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం గురువారం భక్తులతో కిక్కిరిసింది. ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహరాష్ట్ర నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్ కారిడార్, ప్రధాన రహాదారులు, రాఘవేంద్ర సర్కిల్, నదితీరం భక్తులతో కోలాహాలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. క్యూలైన్లు, పరిమళప్రసాదం వద్ద తాకిడి అధికమైంది. రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని భక్తులు పీఠాధిపతుల ఆశీస్సులు పొందారు.