Share News

శ్రీమఠంలో భక్త జనసంద్రం

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:05 AM

మంత్రాలయం రాఘ వేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన అశేష భక్తజనవాహినితో జన సంద్రంగా మారింది. లక్షపైగా భక్తులు వరదలా తరలిరావడంతో శ్రీమ ఠం కిటకిటలాడింది

శ్రీమఠంలో భక్త జనసంద్రం
భక్తులతో కిటకిటలాడుతున్న మధ్వమార్గ్‌ కారిడార్‌

దర్శనానికి ఐదు గంటలు

మంత్రాలయం, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘ వేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన అశేష భక్తజనవాహినితో జన సంద్రంగా మారింది. లక్షపైగా భక్తులు వరదలా తరలిరావడంతో శ్రీమ ఠం కిటకిటలాడింది జూన్‌ నెల మొదటి ఆదివారం సెలవు దినం కావ టంతో దేశనలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు అశేష భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అన్నపూర్ణ భోజనశాల, మహా ముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, తుంగభద్ర నది తీరం భక్తు లతో కోలాహలంగా మారింది. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరి ంచి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకు న్నారు. సీఐ దస్తగిరిబాబు, ఎస్‌ఐ మల్లికార్జున, పోలీసులు, శ్రీమఠం సెక్యూరిటీ ఆధ్వర్యంలో శ్రీమఠం మధ్వమార్గ్‌ ప్రాంగణంలో క్యూలైన్లు అదనంగా ఏర్పాటు చేశారు. ప్రసాదాల కొరత రాకుండా మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోణాపూర్‌ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సాధారణ దర్శనానికి ఐదు గంటలు సమయం పట్టింది. పీఠాధిపతి ఆదేశాల మేరకు మఠం ప్రాంగణంలో మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, సురేష్‌ కోణాపూర్‌, ఐపీ నరసింహమూర్తి, అనంతపురాణిక్‌, రాఘవేంద్రరావు, వ్యాసరాజ ఆచార్‌ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. హైవే రోడ్‌పైనే వాహనాలు పార్కింగ్‌ చేయడంతో భక్తులు తీవ్రబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 12:05 AM