శ్రీమఠంలో భక్తుల కోలాహలం
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:58 PM
రాఘవేంద్ర స్వామి దర్శ నార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం మఠం కోలాహలంగా మారింది.
మంత్రాలయం, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శ నార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం మఠం కోలాహలంగా మారింది. బుధవారం త్రయోదశి కావటంతో దక్షిణాది రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం, మధ్వమార్గ్ కారిడార్ భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖ ద్వారం, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, నదీతీరం భక్తులతో కోలాహలంగా మా రింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూ ల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.