మంత్రాలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:31 PM
: ప్రముఖ పుణ్యక్షేత్ర మైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ధర్శనార్థం వచ్చిన భక్తులతో శ్రీమఠం మార్మోగింది.
మంత్రాలయం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్ర మైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ధర్శనార్థం వచ్చిన భక్తులతో శ్రీమఠం మార్మోగింది. శని, ఆదివారాలు సెలవు దినాలు కావటంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. తుంగభద్ర నది తీరం భక్తులతో కోలాహాలంగా మారింది. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.