Share News

ఎండిన నేలలోనూ పంటలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:24 PM

దేశ వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. లోటు వర్షాలకు భూమిలో విత్తనాలు కూడా వేయలేని దైన్యపరిస్థితి ఉంది.

ఎండిన నేలలోనూ పంటలు

లోటు వర్షాలకు ప్రత్యామ్నాయ సాగుకు శ్రీకారం

తొమ్మిది రకాల పంటలకు అవకాశం

1.94 లక్షల ఎకరాల్లో సాగు

కలెక్టర్‌ డాక్టర్‌ సిరి ప్రజెంటేషన్‌

ప్రభుత్వ సేవల్లో ప్రజల సంతృప్తి 70 శాతమే

సీఎం అధ్యక్షతన రెండో రోజూ కలెక్టర్ల సదస్సు

హాజరైన మంత్రి టీజీ భరత్‌, కలెక్టర్‌, ఎస్పీ

కర్నూలు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. లోటు వర్షాలకు భూమిలో విత్తనాలు కూడా వేయలేని దైన్యపరిస్థితి ఉంది. వర్షాల కోసం ఎదురు కూడకుండా.. వానలు పడకున్నా సాగు భూములను ఖాళీగా వదలకుండా పంటలు సాగు చేసే కొత్త విధానానికి కర్నూలు జిల్లాలో శ్రీకారం చుట్టారు. ‘ప్రీ మాన్సూన్‌ డ్రై సోయింగ్‌.. నేచురల్‌ ఫార్మింగ్‌ (పీఎండీఎస్‌) విధానంతో లోటు వర్షాపాతంలోనూ వివిధ పంటలు సాగు చేసి రైతులు లాభాలు బాట పట్టారు. ఆ విధానాన్ని ఎలా అవలంభించారో కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్‌పై సీఎం చంద్రబాబు కూడా సంతృప్తి వ్యక్తం చేసి అభినందించారు. ఇక పీజీఆర్‌ఎ్‌సకు వచ్చిన కమ్యూనిటీ ఫిర్యాదులు పరిష్కారంలో 13, వ్యక్తిగత ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో 17వ స్థానంలో కర్నూలు జిల్లా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవలపై ప్రజల సంతృప్తి శాతం గతంతో పోలిస్తే తగ్గింది. వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సదస్సుకు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ హాజరయ్యారు.

రాష్ట్రానికి ఆదర్శం పీఎండీఎస్‌

జిల్లాలో ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో భూమిలో విత్తనం వేసేందుకు అనువుగా పదును వర్షాలు కురవలేదు. వర్షాల కోసం ఎదురు చూడకుండా.. ఎండిన నేలల్లోనూ విత్తనాలు వేసే సరికొత్త విధానానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. అదే ‘ప్రీ మాన్సూన్‌ డ్రై సోయింగ్‌.. నేచురల్‌ ఫార్మింగ్‌ (పీఎండీఎస్‌). ఈ విధానం కింద రైతులను చైతన్యపరచి తొమ్మిది రకాల పప్పుదినుసుల సాగుకు ప్రోత్సాహం అందించారు. 2,27,184 ఎకరాల్లో పీఎండీఎస్‌ విధానంలో సాగు లక్ష్యంగా పెట్టుకోగా.. 1,84,764 మంది రైతులు ముందుకు వచ్చారు. 1,98,464 ఎరాల్లో తృణధాన్యాలు, మిల్లెట్స్‌, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయాలు, ఆకుకూరలు.. వంటి పంటల సాగు చేపట్టారు. ఈ విధానం కింద సగు చేసే రైతులకు 15 కిలోల విత్తన కిట్లు ఇచ్చారు. ఆ కిట్లలో బీజామృతంతో శుద్ధి చేసిన 32-36 రకాల విత్తనాలు ఇచ్చారు. పీఎండీఎస్‌ పద్దతిలో సాగు చేసే పొలాల్లో ఉష్ణోగ్రతు కూడా భారీగా తగ్గి.. పంటలపై తేమ శాతం పెరుగుతుంది. ఈ విధానంతో ప్రధాన పంటలతో పాటు బీడు భూములు, చెరువుల నీటి నిల్వ ప్రాంతాలను కూడా సాగులోకి తెచ్చారు. సూపర్‌ ఎల్‌నినో పరిస్థితులు ఉన్నపట్టికి జిల్లాలో 3.61 లక్షల ఎకరాల్లో నేలను సారవంతం చేశారు. తద్వారా పంట దిగుబడి, పశుగ్రాసం రూపంలో రైతులు ఆదాయం పొందుతున్నారు.

స్త్రీశక్తి అదుర్స్‌

సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం’ కల్పించే లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్త్రీశక్తి పథకం’పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 15 నంచి 31వ తేది వరకు కేవలం 15 రోజుల్లో జిల్లాలో 1.77 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పొందారు. రోజుకు సగటున 46 వేల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సాగించారు. 86 బస్సులు ఉపయోగించారు. అలాగే.. దివ్యాంగశక్తి కింద 1.61 లక్షల మంది ఉచిత ప్రయాణం సాగిస్తే, 50 శాతం రాయితీపై 7,048 మంది ప్రయాణం చేశారు.

ఫిర్యాదుల పరిష్కారంలో అసంతృప్తి

ప్రజా ఫిర్యాదుల పరిష్కారం (పీజీఆర్‌ఎ్‌స)లో లబ్దిదారుల్లో ఇంకా అసంతృప్తి కొనసాగుతుంది. ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు 6 వరకు 10,532 వ్యక్తిగత ఫిర్యాదులు వచ్చాయి. 4,736 పెండింగులో పెట్టారు. 5,796 మాత్రమే పరిష్కరించారు. పీజీఆర్‌ఎ్‌సపై ప్రజల్లో 83 శాతం సంతృప్తి ఉంటే, 17 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు. ఆగస్టు 6 నుంచి సెప్టెంబరు 6 వరకు నెల రోజుల్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో 63 శాతం మంది అసంతృప్తిలో ఉన్నారని ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కమ్యూనిటీ పరంగా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలోనూ అదేతీరు కనిపిస్తోంది.

ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న సేవల్లో గతంలో పోలిస్తే ప్రజల్లో సంతృప్తి (పాజిటివ్‌) స్థాయి తగ్గుతుంది. మే 7న జరిగిన కలెక్టర్ల సదస్సు నాటికి జిల్లాలో 71.1 శాతం సంతృప్తి ఉంటే, ప్రస్తుత సదస్సుకు 71.0 శాతానికి తగ్గింది. అంటే.. 0.1 శాతం తగ్గుదల నమోదు చేసుకుంది. ప్రజల్లో 29 శాతం ఇప్పటికీ అసంతృప్తి ఉన్నట్లు లెక్క. పంచాయతీ సేవలు, గృహ నిర్మాణం, వాహన రిజిస్ట్రేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ, స్త్రీశిశు సంక్షేమం, ఆర్‌ అండ్‌ ఎస్‌ రిజిస్ట్రేషన్‌, బియ్యం పంపిణీ, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజన పథకం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ముటేషన్‌, రవాణా శాఖల సేవల సంతృప్తి స్థాయిలు పెరిగితే, వైద్య సేవలు, మహిళా నేరాలు నిరోధించడం, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, విద్యుత్‌, రీసర్వే, ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పంపిణీ, స్కూల్‌ ఎడ్యూకేషన్‌, దీపం, అన్నా క్యాంటిన్లు (అర్బన్‌), ఇసుక, ఏపీఎస్‌ ఆర్టీసీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, తాగునీరు సరఫరా, వీధి దీపాల నిర్వహణ.. వంటి సేవల్లో గతంతో పోలిస్తే ప్రజల్లో అసంతృప్తి పెరిగింది.

వివిధ విభాగాల పనితీరు ఇలా:

జిల్లాలో 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఐదు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, రెండు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. జూన్‌ 24న ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీఎం చంద్రబాబు సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రభుత్వ పాఠశాల్లో సెప్టెంబరు 5 వరకు విద్యార్థుల హాజరు 78.88 శాతంతో జిల్లా అట్టడుగు స్థాయిలో ఉంటే, ఉపాధ్యాయుల హాజరు 99.20 శాతం మెరుగుదల సాధించింది. 10వ తరగతి అభ్యసన, ఫలితాలు మెరుగు పచడానికి విద్యార్థులను వర్గీకరించారు. 7.54 శాతం షైనింగ్‌ స్టార్స్‌, 92.46 శాతం రైజింగ్‌ స్టార్స్‌లో ఉన్నారు.

జిల్లాలో 1,423 వివిధ క్యాటగిరీ పాఠశాలు ఉన్నాయి. 1,278 పాఠశాలకు మూడు లోపు, 144 పాఠశాలలకు త్రీస్టార్‌, ఒక్క పాఠశాల మాత్రం 4 స్టార్స్‌ రేటింగ్‌లో ఉంటే, ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌లో ఒక్క పాఠశాల కూడా లేదు.

సమగ్ర శిక్షలో భాగంగా 2025-26లో 177.81 కోట్లు మంజూరు కాగా, 136.41 కోట్లు ఖర్చు చేసి 76.71 శాతం పురోగతి సాధించారు. 2026-27లో రూ.149.26 కోట్లు బడ్జెట్‌ కేటాయిస్తే, రూ.40.37 కోట్లు మంజూరయింది. అందులో రూ.33.44 కోట్లు ఖర్చు చేశారు. పీఎంశ్రీ కింద ఎంపికైన 54 పాఠశాలలకు 2025-26లో రూ.1.79 కోట్లు విడుదల చేయగా, రూ.1.33 కోట్లు ఖర్చు చేశారు. 2026-27లో రూ.4.35 కోట్లు లక్ష్యంగా కాగా, రూ.25 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు.

అక్షర ఆంధ్రలో భాగంగా ప్రభుత్వం నిర్వహించిన సర్వే మేరకు జిల్లాలో 26,72,635 మంది జనాభాలో 5,74,755 మంది నిరక్షరాస్యులు (21.5 శాతం)గా గుర్తించారు. కర్నూలు జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలోనిలిచింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా పీఎంకేవీవై కింద 360 శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15,717 మంది శిక్షణలో చేరితే వారిలో 13,733 మంది అర్హత సాధించారు. 7,936 మందికి టూల్‌కిట్స్‌ అందజేశారు.

జిల్లాలో 100 జాబ్‌ మేల కార్యక్రమాలు నిర్వహించాలని లక్ష్యంగా కాగా 103 జాబ్‌మేళా కార్యక్రమాలు నిర్వహించి 4,528 మంది నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించారు. నైపుణ్యం శిక్షణ కోసం 38,789 మంది విద్యార్థులను చేర్చించాలని లక్ష్యంగా పెట్టుకుంటే 11,456 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. 27,333 మంది విద్యార్థులను రిజిస్ట్రేషన్‌ చేయించాల్సి ఉంది.

స్వయం సహాక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు 2026 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు 5 వరకు గ్రామీణ ప్రాంతాల్లో 44,970 మందికి రూ.509.43 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 1,667 సంఘాలకు రూ.251.44 కోట్లు బ్యాంక్‌ లింకేజీ రుణాలు ఇప్పించారు.

ఎల్‌నినోలోనూ పంటల సాగు

రైతులకు ప్రీ మాన్సూన్‌ డ్రై సోయింగ్‌ - నేచురల్‌ ఫార్మింగ్‌ (పీఎండీఎస్‌) సంజీవని వంటింది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయింది. పీఎండీఎస్‌ కింద పంటలు సాగు చేసేలా రైతులకు ప్రోత్సాహం అందించాం. మా లక్ష్యం భూములు ఖాళీగా ఉండకూడదు. ఈ పద్దతి అనుసరించిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో 10-20 శాతం తేడా ఉన్నట్లు గుర్తించాం. సీడ్‌ పెల్లటైజేషన్‌ ద్వారా వివిధ ప్రాంతాల్లో విత్తనాలు చల్లి సాగుకు అవకాశం కల్పించాం. జిల్లాలో 1.94 లక్షల ఎకరాల్లో ఈ విధానం కింద సాగు చేశారు. బంజరు భూములు, చెరువు గట్లను కూడా ఈ సాగు పరిధిలోకి తీసుకొచ్చాం. ఇది ఎంతో ఉత్తమమైన విధానం.

- డాక్టర్‌ ఎ.సిరి, కలెక్టర్‌

Updated Date - Sep 11 , 2026 | 11:24 PM