Share News

పంటల తొలగింపు

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:34 AM

ల్‌నినో ప్రభావం రైతులను అతలాకుతలం చేస్తోంది. మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన రైతులు మహబూబ్‌ బాషా, మాబాషా ఖరీఫ్‌ సీజన్‌లో లక్ష్మాపురం అంచె సమీపంలోని 10 ఎకరాల్లో మొక్కజొన్న, 2 ఎకరాల్లో సోయాబిన్‌ పంటలను నెల కిందట సాగు చేశారు. విత్తు వేసినప్పటి నుంచి పదునైన వర్షం కురవక పైరు ఎండి పోయింది.

పంటల తొలగింపు
లక్ష్మాపురంలో సోయాబీన్‌ పంటను ట్రాక్టర్‌తో దున్నుతున్న రైతులు

పగిడ్యాల, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం రైతులను అతలాకుతలం చేస్తోంది. మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన రైతులు మహబూబ్‌ బాషా, మాబాషా ఖరీఫ్‌ సీజన్‌లో లక్ష్మాపురం అంచె సమీపంలోని 10 ఎకరాల్లో మొక్కజొన్న, 2 ఎకరాల్లో సోయాబిన్‌ పంటలను నెల కిందట సాగు చేశారు. విత్తు వేసినప్పటి నుంచి పదునైన వర్షం కురవక పైరు ఎండి పోయింది. చేసేదేమీ లేక సోమవారం పంటను ట్రాక్టర్‌తో తొలగించారు. పంటల సాగు కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. వర్షం కురిస్తే మరోసారి మినుము, కొర్ర సాగు చేస్తామని, లేకుంటే చేయబోమని తెలిపారు.

Updated Date - Jul 28 , 2026 | 12:34 AM