పీఎండీఎస్‌తో పంటకు రక్షణ
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:31 PM
ఎల్‌నినో ప్రభావం వల్ల సుమారు 15 రోజుల నుంచి వర్షాభావ పరిస్థితు లు నెలకొన్నాయని, దీన్నుంచి పంటను రక్షించు కోవాలంటే రైతులు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) చేసుకోవాలని కలెక్టర్ డా.ఏ. సిరి విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో 92వేల ఎకరాల లక్ష్యం
కలెక్టర్ ఏ. సిరి
కర్నూలు అగ్రికల్చర్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం వల్ల సుమారు 15 రోజుల నుంచి వర్షాభావ పరిస్థితు లు నెలకొన్నాయని, దీన్నుంచి పంటను రక్షించు కోవాలంటే రైతులు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) చేసుకోవాలని కలెక్టర్ డా.ఏ. సిరి విజ్ఞప్తి చేశారు. చిరుధాన్యాలు, పప్పుదినుసులు, నూనె గింజలు మొదలగు 36 రకాల గింజలు జీవామృతంతో శుద్ధి చేసుకుని మట్టి, బూడిదతో కలిపి పొలాల్లో చల్లుకోవాలని రైతులకు పిలుప ునిచ్చారు. మంగళవారం వ్యవసాయం, అనుబం ధ విభాగాల అధికారులతో పీఎండీఎస్‌పై సమీక్ష నిర్వహిం చారు. ఈ పీఎండీఎస్ మిశ్రమం వర్షం పడే వరకు పొలాల్లో అలాగే ఉంటుందని, దీని వల్ల వర్షం పడినప్పుడు మిశ్రమంలోని గింజలు మొలకెత్తి ప్రధాన పంటకు రక్షణ దొరుకుతుం దని తెలిపారు. పీఎండీఎస్ వల్ల భూసారం పెరిగి నీటి తేమ మట్టిలో అలాగే ఉంటుందని, ప్రధాన పంటకు నీడ అందుతుందని తెలిపారు. వర్షం తక్కువ పడినా లాభం ఉంటుందన్నారు. ప్రధాన పంటకు 15 రోజుల పాటు నీరు లేకపోయినా ఇబ్బంది ఉండదన్నారు. జిల్లాలో 92వేల ఎకరాల్లో పీఎండీఎస్ విధానం లక్ష్యంగా నిర్ణయించామని అన్నారు. ఇప్పటికి 74వేల ఎకరాల్లో పూర్తి చేయగలిగామన్నారు. మరో లక్ష ఎకరాల్లో ఇదే పద్ధతుల్లో ట్యాంకు బెడ్లలో పశుగ్రాసం చేయించాలని కలెక్టర్ ఇరిగేషన్, పశుసంవర్ధకశాఖ, డ్వామా అధికారులను ఆదేశించారు.