రైతులకు రుణ పరిమితి పెంచాలి
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:35 AM
పంటల సాగుకు సంబంధించి విత్తనాలు, ఎరువులు కూలీలు ఖర్చులు పెరగడంతో రైతులకు రుణ పరిమితిని పెంచాలని కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. మంగళవారం కాన్ఫరెన్స్ హాలులో రుణపరిమితి నిర్ధారణకు సంబందించి బ్యాంకర్ల టెక్నికల్ కమిటీ సమావేశం సహకార కేంద్ర బ్యాంకు సీఈవో రామాంజనేయులు అధ్యక్షత వహించారు.
బ్యాంకర్ల టెక్నికల్ కమిటీ సమావేశంలో కలెక్టర్
కర్నూలు అగ్రికల్చర్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): పంటల సాగుకు సంబంధించి విత్తనాలు, ఎరువులు కూలీలు ఖర్చులు పెరగడంతో రైతులకు రుణ పరిమితిని పెంచాలని కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. మంగళవారం కాన్ఫరెన్స్ హాలులో రుణపరిమితి నిర్ధారణకు సంబందించి బ్యాంకర్ల టెక్నికల్ కమిటీ సమావేశం సహకార కేంద్ర బ్యాంకు సీఈవో రామాంజనేయులు అధ్యక్షత వహించారు. నాబార్డు ఏజీఎం సుబ్బారెడ్డి లీడ్ బ్యాంకు మేనేజర్ రామచంద్రరావు, వివిద బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. వర్షాధారం కింద జొన్న సాగుకు రూ.25వేల నుంచి రూ.28వేలు రుణం అందించేందుకు బ్యాంకర్ల టెక్నికల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సజ్జ్దకు 21వేల నుంచి రూ.25వేలు, కొర్రకు రూ.15వేలు-17వేలు, కందులకు రూ.30 వేల నుంచి రూ.35వేలు, మినుములకు రూ.30వేల నుంచి రూ.35వేలు, పత్తికి రూ.51వేల నుంచి రూ.55వేలు, వేరుశనగ పంటకు రూ.42వేల నుంచి రూ.45వేలు, శనగ పంట సాగుకు రూ.37వేల నుంచి రూ.40వేలు, సోయాబీన్‌కు రూ.17వేల నుంచి రూ.20వేలు, పచ్చిమిర్చి సాగుకు రూ.70వేల -80వేలు, ఎండు మిర్చికి రూ.1.50లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు రుణాన్ని అందించాలని కమిటీ నిర్ణయంతీసుకుంది. వచ్చే ఖరీఫ్‌కు ఈ రుణపరిమితి ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ డా.సిరి అన్ని బ్యాంకుల మేనేజర్లను ఆదేశించారు.