రోడ్డుపై మొసలి పిల్ల
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:43 AM
కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని కందుకూరు గ్రామ సమీపంలోని రామలింగేశ్వర దేవాలయం దగ్గర తుంగభద్ర నది సమీపంలోని రోడ్డుపై ఓ చిన్న మొసలి పిల్ల ప్రత్యక్షమై వాహనదారులను, బాటసారులను ఆశ్చర్యానికి గురి చేసింది.
తుంగభద్ర సమీపంలో ప్రధాన రోడ్డుపై ప్రత్యక్షం
వీడియో తీసిన వాహనదారులు
కోసిగి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని కందుకూరు గ్రామ సమీపంలోని రామలింగేశ్వర దేవాలయం దగ్గర తుంగభద్ర నది సమీపంలోని రోడ్డుపై ఓ చిన్న మొసలి పిల్ల ప్రత్యక్షమై వాహనదారులను, బాటసారులను ఆశ్చర్యానికి గురి చేసింది. నది నీటి ప్రవాహం నుంచి ఇది కొట్టుకొచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. రోడ్డుపై ఊహించని విధంగా మొసలి పిల్ల కనిపించడంతో వెళ్లేవారు తమ ఫోన్లలో వీడియోలు తీశారు. అయితే వాహనాల రాకపోకలు శబ్దాలు ఎక్కువ కావడంతో ఆ భయంతో మొసలి పిల్ల సమీపంలోని ముళ్ల పొదల్లోకి వెళ్లిపోయింది.