Share News

అభివృద్ధిని ఓర్వలేకనే విమర్శలు

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:12 AM

నియోజకవర్గంలో రెండేళ్లలో 438.62 కోట్లతో బీసీ బిడ్డగా అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకనే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సీఎం చంద్రబాబుపై ఆరోపిస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌ రాఘవేంద్రరెడ్డి అన్నారు.

అభివృద్ధిని ఓర్వలేకనే విమర్శలు
మాట్లాడుతున్న రాఘవేంద్రరెడ్డి

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి

మంత్రాలయం, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో రెండేళ్లలో 438.62 కోట్లతో బీసీ బిడ్డగా అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకనే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సీఎం చంద్రబాబుపై ఆరోపిస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌ రాఘవేంద్రరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం తన నివాసమైన మాధవరంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాధవరానికి వచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రాలయం నియోజక వర్గానికి తాను కోరిన తాగు, సాగునీరు ప్రాజెక్టులకు, 100 పడలకల ఆస్పత్రికి, నిరుద్యోగ యువతకు పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నిధులమంజూరుకు అంగీకారం తెలపారన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని మూడు ముక్కలాటచేసి ఒక్క ఇటుక కూడా కట్టలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి 7 గ్రామాలకు స్వేచ్చ, అభివృద్ది కలిగించేందుకు ప్రణాళి కలు చేస్తున్నారన్నారు. 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏమి అభివృద్ధి చేశావో ప్రజలకు తెలుసని అన్నారు. బీసీ ఓట్లతో గెలుస్తూ బీసీలను అణగదొక్కుతున్న నీకు వచ్చే ఎన్నిల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో సింగిల్‌ విండో అధ్యక్షుడు రామకృష్ణరెడ్డి, మాజీ సర్పంచ్‌ రఘునాథరెడ్డి, రాకే్‌షరెడ్డి, టీడీపీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి చావిడి వెంకటేష్‌, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, టీడీపీ మండల అధ్యక్షులు ఎస్‌ఎం గోపాల్‌రెడ్డి, మల్లికార్జున, ఆలంభాషా, చాపల నగేష్‌, రాగన్న, భీమయ్య, మల్లయ్య, మల్లేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 12:12 AM