Share News

ఓర్వలేక విమర్శలు

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:18 AM

నియోజక వర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు.

ఓర్వలేక విమర్శలు
పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అఖిలప్రియ

ఆళ్లగడ్డ, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): నియోజక వర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు. బుధవారం పడకండ్ల గ్రామంలో రూ.75లక్షల సీసీ రోడ్డు, డ్రైనేజ్‌ పనులను ప్రారంభించారు. గ్రామంలోని కాసిరెడ్డి నాయన ఆలయం నుంచి సీఎస్‌ఐ చర్చి వరకు 900 మీటర్ల సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించామన్నారు. గ్రామ ప్రజలు ఏళ్లుగా ఎదురు చూస్తున్న రహదారి, మరుగు కాలువలను, నీటి సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం గ్రామాభివృద్ధికి ప్రాధన్యమిస్తోందన్నారు. రాబోయో రోజుల్లో ఆళ్లగడ్డను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రెండు ఏళ్లుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వెసీపీ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కౌన్సిలర్లు సుధాకర్‌రెడ్డి, హుసెన్‌బాషా, నాయకులు మద్దులేటి, రామక్రిష్టారెడ్డి, పుల్లారెడ్డి, కమిషనర్‌ కిషోర్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 12:18 AM