పేడ రంగు విక్రయిస్తే క్రిమినల్ కేసులు : సీఐ
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:13 AM
పేడ రంగు ప్యాకెట్లను విక్రయిస్తే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐ హనుమంతు నాయక్ హెచ్చరించారు.
కోవెలకుంట్ల, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): పేడ రంగు ప్యాకెట్లను విక్రయిస్తే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐ హనుమంతు నాయక్ హెచ్చరించారు. ఆదివారం ఎస్‌ఐ మల్లికార్జున్ రెడ్డితో కలిసి పట్టణంలోని పలు దుఖాణాలను తనిఖీ చేసి పేడరంగు పాకెట్లును స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఎవరూ వీటిని కొనుగోలు చేయవద్దన్నారు. ఎవరైనా పేడరంగు పాకెట్లను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మహిళలు గొడవపడినప్పుడు క్షణికావేశానికి లోనై పౌడర్ తాగి ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు.
పేడ రంగు విక్రయాలపై కఠిన చర్యలు
కొలిమిగుండ్ల: పేడరంగు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రమే్‌షబాబు హెచ్చరించారు. ఆదివారం పోలీస్ స్టేషన్‌లో మాట్లాడుతూ పేడరంగు మహిళల ప్రాణాలను బలిగొంటుందని అతి తక్కువ ధరకు సులభంగా దొరుకుతుండటంతో దీన్ని తాగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దుకాణదారులు పేడ రంగును విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.