నేర నియంత్రణే లక్ష్యం
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:39 PM
జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసు అధికారులు పనిచేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపునిచ్చారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసు అధికారులు పనిచేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పోలీసు అధికారులు అలసత్వం వహించకుండా గట్టిగా పని చేయాలన్నారు. డయల్ 112 కాల్స్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే పోలీసు ఉద్యోగానికి సమస్యలు వస్తాయన్నారు. సీసీఎస్ పోలీసులు పనితీరుపై ఆరాతీశారు. నేర పరిశోధనకు కట్టుబడి ఉండాలన్నారు. రాత్రి గస్తీలు, విజిబుల్ పోలిసింగ్‌ను బలోపేతం చేయాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తులను పకడ్బందీగా నిర్వహించాలని, డ్రోన్ కెమెరాలను నేరాల నియంత్రణకు సమర్ధవంతంగా ఉపయోగించాలన్నారు. ప్రాపర్టీ కేసులను చేధించాలని, రికవరీ శాతాలను పెంచాలని సూచించారు. ఫోక్సో కేసులలో 60 రోజులోపు చార్జ్‌షీటు నమోదు చేయాలని ఆదేశించారు. గత నెలలో వివిధ కేసుల్లో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఆయన ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ హుశేన్‌పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు వెంకట్రామయ్య, ఉపేంద్రబాబు, భార్గవి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.