Share News

ఆర్‌యూలో ఆకలి కేకలు

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:10 PM

రాయలసీమ యూనివర్సిటీ(ఆర్‌యూ)లో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈనెల 15న వేసవి సెలవుల అనంతరం యూనివర్సిటీ పునఃప్రారంభమైంది.

ఆర్‌యూలో ఆకలి కేకలు
ఆర్‌యూ ఎదుట రోడ్డుపై అర్ధరాత్రి నిరసన

రోడ్డెక్కిన విద్యార్థులు

అర్ధరాత్రి జాతీయ రహదారి దిగ్బంధం

కర్నూలు అర్బన్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): రాయలసీమ యూనివర్సిటీ(ఆర్‌యూ)లో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈనెల 15న వేసవి సెలవుల అనంతరం యూనివర్సిటీ పునఃప్రారంభమైంది. మూడేళ్లుగా విద్యార్థులు ప్రభుత్వం నుంచి మెస్‌ చార్జీలు తీసుకుంటు న్నప్పటికీ వర్సిటీకి చెల్లించక పోవడంతో కోటికిపైనే బకాయిలున్నాయని, భోజన సదుపాయాలు కల్పించే స్థితిలో లేమని అధికారులు తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలో సెకండియర్‌ పీజీ, బీటెక్‌ విద్యార్థులు అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డెక్కారు. ఆదివారం అర్ధరాత్రి నంద్యాల ప్రఽధాన రహదారిని దిగ్బంధించారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను స్టేషన్‌కు తరలించి మందలించి పంపారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌ ఎదుట ఏఐఎస్‌ఏ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున ఆధ్వర్యంలో నిరసన తెలిపి అనంతరం జిల్లా జేసీ నూరుల్‌ ఖమర్‌కు వినతి ప్రతం అందించారు. వర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించి న్యాయం చేయాలని విద్యార్థులు జేసీని కోరారు. జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఈనెల 25న ఉండటంతో యూనివర్సిటీ విషయాలను ఆయన దృష్టికి తీసుకె ళ్లేందుకు విద్యార్ధి సంఘాల నాయకులు సిద్ధమౌతున్నారు.

Updated Date - Jun 22 , 2026 | 11:10 PM