Share News

పథకాలపై అవగాహన కల్పించండి

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:16 PM

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ డా.సిరి అధికారులను ఆదేశించారు.

పథకాలపై అవగాహన కల్పించండి
స్వర్ణాంధ్ర-2047 క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ డా.సిరి

కలెక్టర్‌ ఏ. సిరి

కర్నూలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ డా.సిరి అధికారులను ఆదేశించారు. సమాచార శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన స్వర్ణాంధ్ర-2047 క్యాలెండర్‌ను శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో జీడీడీపీ, తలసరి ఆదాయం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆమేరకు ఆయా శాఖల అధికారులు ప్రణాళికాబద్ధంగా పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజల నుంచి మంచి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చేలా అధికారులు పని చేయాలని సూచించారు. వ్యవసాయం, పశుసంవర్ధ్దకం, డ్రిప్‌ ఇరిగేషన్‌ తదితర రంగాల్లో రైతులు తలసరి ఆదాయం పెరిగేలా బలోపేతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, సమాచార శాఖ ఉప సంచాలకులు జయమ్మ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 11:17 PM