Share News

నడిరోడ్డుపై మూగజీవాలు

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:04 AM

పట్టణంలోని ప్రధాన రహదారిపై మూగజీవాలు తిష్టవేస్తున్నాయి. రహదారికి అడ్డంగా ఆవులు నిలబడుతుండడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

నడిరోడ్డుపై మూగజీవాలు
బస్టాండు వద్ద సంచరిస్తున్న ఆవులు

కోవెలకుంట్లలో రోడ్డుపైనే ఆవుల సంచారం

వాహనదారుల ఇబ్బందులు

కోవెలకుంట్ల, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రధాన రహదారిపై మూగజీవాలు తిష్టవేస్తున్నాయి. రహదారికి అడ్డంగా ఆవులు నిలబడుతుండడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి 7 గంటలు దాటాక ఆవులన్నీ ఒక్కసారిగా అవుకు సర్కిల్‌ నుంచి జమ్మలమడుగు సర్కిల్‌ , ఆర్‌ అండ్‌ బీ రహదారిలో గ్రామపంచాయతీ సర్కిల్‌ వద్ద, గుంజలపాడు రహదారిలో గుంపులుగా చేరుకుంటున్నాయి. వాహనదారులను ఆవులు ఆటంకపరుస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ అధికారులకు ఆవులను ఇక్కడి నుంచి తరలించాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి ఆవుల యజమానులకు నోటీసులు ఇచ్చి వాటిని ఇక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు.

Updated Date - Oct 05 , 2026 | 12:04 AM