Share News

రహదారులపై మూగజీవాలు

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:54 PM

పట్టణంలోని రహదారులపై ఆవులు తిష్ఠవేశాయు. రహదారులకు అడ్డంగా ఉండటంతో వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల సీపీఎం నాయకుడు మధుశేఖర్‌ బైక్‌పై వెళుతూ ఆవును తప్పించబోయి కిందపడ్డారు. గతంలో ఓ కానిస్టేబుల్‌, పత్రికా విలేకరి సైతం చేతులు విరగొట్టుకున్నారు.

రహదారులపై మూగజీవాలు
బేతంచెర్లలో నడిరోడ్డుపై సంచరిస్తున్న ఆవులు

బేతంచెర్లలో ఆవులు, పందులు, కుక్కల బెడద

ప్రమాదాలబారిన పడుతున్న వాహనదారులు

బేతంచెర్ల, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రహదారులపై ఆవులు తిష్ఠవేశాయు. రహదారులకు అడ్డంగా ఉండటంతో వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల సీపీఎం నాయకుడు మధుశేఖర్‌ బైక్‌పై వెళుతూ ఆవును తప్పించబోయి కిందపడ్డారు. గతంలో ఓ కానిస్టేబుల్‌, పత్రికా విలేకరి సైతం చేతులు విరగొట్టుకున్నారు.

హెచ్చరికలతో సరిపెడుతున్న అధికారులు

ఆవులను రోడ్లపైకి వదిలేస్తున్న యజమానులకు నగర పచాయతీ అధికారులు కేవలం హెచ్చరికలు జారీచేసి వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆవుల యజమానులపట్ల కఠినంగా వ్యవహరించడం లేదని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పందులు, కుక్కలు కూడా..

ఆవులతో పాటు పందులు, కుక్కలు కూడా రోడ్లపై తిష్టవేస్తూ పాదచారులు, వాహనదారులపై దాడులు చేస్తున్నారు. పలుమార్లు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నగర పంచాయతీ అధికారులు స్పందించి మూగజీవాలు, కుక్కలు, పందులను తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

నోటీసులు ఇచ్చాం

ఆవుల, పందుల యజమానులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. వాటిని రోడ్లపైకి వదలొద్దని ఆదేశాలు జారీ చేశాం. అలాగే కుక్కల నివారణకు చర్యలు తీసుకుంటాం. - హరి ప్రసాద్‌, కమిషనర్‌, నగర పంచాయతీ, బేతంచెర్ల

Updated Date - Apr 21 , 2026 | 11:54 PM