మహానందీశ్వరుడి హుండీ లెక్కింపు
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:49 PM
మహానంది క్షేత్రంలో శనివారం హుండీ లెక్కింపు నిర్వహించారు.
దేవస్థానానికి రూ.37.47లక్షల ఆదాయం
మహానంది, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో శనివారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 36రోజులకు దేవస్ధానానికి రూ.37.47 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రధాన ఆలయాల్లోని హుండీలతో పాటు గోశాల, అన్నదానం వద్ద ఏర్పాటుచేసిన హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను ఆలయం ప్రాంగణంలోని అభిషేక మంటపంలో సిబ్బంది సహాయంతో లెక్కింపు నిర్వహించగా రూ.37,47,126 ఆదాయం లభించినట్లు ఈవో పేర్కొన్నారు. వీటితో పాటు 3 యూఎస్‌ఏ డాలర్‌తో పాటు ఒక భూటన్ కరెన్సీ వచ్చిందన్నారు. ఈ లెక్కింపులో జిల్లా దేవదాయ శాఖ అధికారి ఎస్.మోహన్‌తో పాటు ఏఈవో మధు, వివిధ స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.