మహానందీశ్వరుడి హుండీ లెక్కింపు
ABN , Publish Date - Jul 18 , 2026 | 11:14 PM
మహానందీశ్వరుడి హుండీ ని శనివారం లెక్కించారు. దేవస్ధానానికి రూ.52.50లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
దేవస్థానానికి రూ.52.50లక్షలు ఆదాయం
మహానంది, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మహానందీశ్వరుడి హుండీ ని శనివారం లెక్కించారు. దేవస్ధానానికి రూ.52.50లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. భక్తులు ఉభయ దేవాలయాల్లోని హుండీల్లో 50 రోజుల పాటు వేసిన కానుకలను ఆలయ ప్రాంగణంలోని అభిషేక మంటపంలో సిబ్బంది, సేవాసమితి సభ్యులతో లెక్కించారు. ప్రధాన ఆలయాల్లోని హుండీల ద్వారా రూ.51,70,417లక్షలు, అన్న ప్రసాదం హుండీ ద్వారా రూ.55,670, గో సంరక్షణ హుండీ ద్వారా రూ.24వేలు ఆదాయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ గ్రూపు దేవాలయాల ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి, ఏఈవో మధు, పర్యవేక్షకులు శశిధర్‌రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్యతో పాటు బాలాజి సేవా సమితి, శ్రీరామ సేవా ట్రస్ట్ సేవకులు పాల్గొన్నారు.