Share News

మంత్రాలయంలో హుండీ లెక్కింపు

ABN , Publish Date - Oct 23 , 2026 | 11:32 PM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.3,46,53,864 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోణాపూర్‌, శ్రీపతిఅచార్‌ తెలిపారు.

మంత్రాలయంలో హుండీ లెక్కింపు
హుండీ లెక్కింపును పరిశీలిస్తున్న మఠం మేనేజర్‌

రూ.3.46 కోట్లు, బంగారం, వెండి సమర్పించిన భక్తులు

మంత్రాలయం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.3,46,53,864 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోణాపూర్‌, శ్రీపతిఅచార్‌ తెలిపారు. ఈనెల 1వ తేదీ నుంచి 22 వరకు భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని మఠం గురురాజాంగణ భవనంలో దేవదాయ శాఖ నుంచి కమలాకర్‌ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కించినట్లు తెలిపారు. నగదుతో పాటు 645 గ్రాముల వెండి, 42 గ్రాములు బంగారం, వివిధ దేశాల కరెన్సీ వచ్చినట్లు చెప్పారు. హుండీ లెక్కింపులో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, అనంత పురాణిక్‌, జేపీ స్వామి, కృష్ణమూర్తి, దేశాయ్‌ నరసింహమూర్తి, గిరిధర్‌, సుజ్ఞానేంద్ర, శ్రీపాధాచార్‌, దత్తుస్వామిపాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2026 | 11:32 PM