రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:37 PM
జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ చేశారు.
కర్నూలు క్రైం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ చేశారు. వీరందరినీ స్టేషన్‌కు పిలిపించి నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు నిఘా ఏర్పాటు చేశామని హెచ్చరించారు.