తటస్థంగా పత్తి ధరలు
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:58 PM
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పత్తి ధరలు 20 రోజులుగా తటస్థంగా ఉన్నాయి.
క్వింటా రూ.8,329
ఆదోని అగ్రికల్చర్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పత్తి ధరలు 20 రోజులుగా తటస్థంగా ఉన్నాయి. గురువారం 956 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర రూ.4,080, మధ్యస్థం రూ.7,739, గరిష్ఠ ధర రూ.8,329 పలికింది. పత్తి ధరలు పెరుగుతాయని చాలామంది రైతులు ఇళ్లలో నిలువ ఉంచుకు న్నారు. ధరలు పెరగకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు, ఉగాది పండుగ కైనా ధరలు పెరగా లని రైతులు ఆశిస్తున్నారు.