Share News

పత్తి ధర పతనం

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:01 PM

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో రోజు రోజుకూ పత్తి ధరలు మరింత పతనమవుతున్నాయి.

పత్తి ధర పతనం
విక్రయానికి వచ్చిన పత్తి దిగుబడులు

వారంలో క్వింటానికి రూ.400 తగ్గిన ధర

ఆదోని అగ్రికల్చర్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి) : ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో రోజు రోజుకూ పత్తి ధరలు మరింత పతనమవుతున్నాయి. గత వారంతో పోల్చితే క్వింటానికి రూ.400 పైగా ధర తగ్గింది. మంగళవారం పత్తి క్వింటం రూ. 9755లకు పతనమైంది. ఇప్పుడిప్పుడే ఖరీఫ్‌ సీజన్‌లో సాగైన పత్తి చేతికందడంతో రైతులు విక్రయానికి తీసుకొస్తున్నారు. అసలే ఎల్‌నినో ప్రభావంతో దిగుబడి తగ్గి రైతులు దిగాలు చెందుతున్న సమయంలో ధరలు సైతం పతనం కావడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. 9094 క్వింటం పత్తి విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర రూ. 4011 మధ్యస్థ ధర రూ. 9489, గరిష్ఠ ధర రూ. 9755 పలికింది.

Updated Date - Sep 22 , 2026 | 11:01 PM