Share News

పత్తి రైతు దిగాలు

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:19 PM

కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులను ఊరించి ఉసూరుమనిపించింది. గత నెలలో విదేశాల నుంచి దిగుమతయ్యే పత్తిపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని ఉపసంహరించింది. దీంతో పత్తి సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం నిర్ణయంతో టెక్స్‌టైల్‌ పరిశ్రమ యజమానులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులు తమ పత్తిని కొనే అవకాశాలు తగ్గిపోతాయని ఆవేదన చెందుతున్నారు.

పత్తి రైతు దిగాలు
పెంచికలపాడు జిన్నింగ్‌ మిల్లులో రైతులు అమ్మకానికి తెచ్చిన పత్తి

విదేశాల నుంచి దిగుమతయ్యే పత్తిపై సుంకాల ఉపసంహరణ

స్వదేశీ పత్తికి తగ్గనున్న డిమాండ్‌

పత్తి సాగులో కర్నూలు జిల్లా ప్రథమస్థానం

మద్దతు ధర పెంచినా లాభం లేదంటున్న రైతులు

కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులను ఊరించి ఉసూరుమనిపించింది. గత నెలలో విదేశాల నుంచి దిగుమతయ్యే పత్తిపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని ఉపసంహరించింది. దీంతో పత్తి సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం నిర్ణయంతో టెక్స్‌టైల్‌ పరిశ్రమ యజమానులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులు తమ పత్తిని కొనే అవకాశాలు తగ్గిపోతాయని ఆవేదన చెందుతున్నారు. ఏపీలో పత్తిని సాగు చేసే జిల్లాలో కర్నూలు మొదటి స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఓ వైపు స్వదేశంలో సాగయ్యే పంట ఉత్పత్తులను ఉపయోగించాలని హితబోధ చేస్తోంది. మరో వైపు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న పంటలపై సుంకాన్ని ఎత్తివేసింది. ఈ వైఖరి పై రైతు సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు అగ్రికల్చర్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): పత్తి దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం సుంకాలు ఎత్తివేయడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో గతేడాది 2.65 లక్షల హెక్టార్లలో పత్తి పంటను సాగు చేశారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)తో పాటు జిన్నింగ్‌ మిల్లులు గత సంవత్సరం రైతుల నుంచి భారీగానే పత్తిని కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్‌లో కూడా వ్యాపారులు పెద్ద ఎత్తున రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేశారు. వ్యాపారులు క్వింటానికి రూ.6,500 నుంచి రూ.7,500 దాకా రైతులకు చెల్లించారు. ఉమ్మడి జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పంటలన్నింటిలో ఒక్క పత్తికి మాత్రమే రైతులకు అధిక ధర లభిస్తుండటం విశేషం. ఈసారి కూడా రైతులకు వ్యాపారుల నుంచే కాకుండా సీసీఐ కూడా భారీగా పత్తిని కొనుగోలు చేసే అవకాశాలు న్నాయి. గత నెలలో కేంద్ర ప్రభుత్వం క్వింటం పత్తికి రూ.8,650 మద్దతు ధరను ప్రకటిం చింది. గత ఏడాది క్వింటం రూ.8,110 మద్దతు ధర ఉండేది. ఒకేసారి క్వింటంపై రూ.540 ధర పెరగడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం ఇటీవల విదేశాల నుంచి భారతదేశంలోకి దిగుమతి చేసుకుంటున్న పత్తిపై దిగుమతి సుంకం 11 శాతాన్ని ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గతేడాది పత్తి రైతుకు లాభాలు

గతేగాది పత్తి పంటను సాగు చేసిన రైతులు లాభాల బాట పట్టారు. క్వింటా నికి వ్యాపారులు 7,500ల దాకా చెల్లిం చారు. సీసీఐ రైతులకు క్విం టానికి రూ.8,110 చెల్లించి దాదాపు రూ.500 కోట్ల విలువ చేసే పత్తిని కొను గోలు చేసింది. ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులు పత్తి సాగుపైనే మొగ్గు చూపుతు న్నారు. క ర్నూలు జిల్లాలో 2.52లక్షల హెక్టార్లలో, నంద్యాల జిల్లాలో 15వేల హెక్టార్లలో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు అంచనా వేసు ్తన్నాయి.

ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు...

కర్నూలు జిల్లాలో కల్లూరులో 7,087 హెక్టార్లు, కోడుమూరులో 6,679, గూడూరులో 6,923, సి.బెళగల్‌లో 8,040, ఓర్వకల్లు మండలంలో 3,087, ఆదోనిలో 24,061, కౌతాళంలో 19,900, కోసిగిలో 9,782, పెద్దకడుబూరులో 7,585, ఎమ్మిగనూరు మండలంలో 13,282, నందవరంలో 16,097 హెక్టార్లు. మంత్రాల యంలో 10,192, గోనెగండ్లలో 10,983, ఆలూరు లో 10,020, చిప్పగిరిలో 2,466, ఆస్పరిలో 18,528, హోళగుందలో 12.642 హెక్టార్లు, హాల హర్విలో 5,830, పత్తికొండలో 8,019, దేవనకొండలో 16,065, తుగ్గలిలో 2,727, మద్దికెరలో 989, వెల్దుర్తిలో 4,210, కృష్ణగిరిలో 9,748, కర్నూలు రూరల్‌లో 4,716 హెక్టార్లు ప త్తి సాగయ్యే అవకాశముందని వ్యవ సాయ శాఖ అధికారులు తెలిపారు. నం ద్యాల జిల్లాలో ఓర్వకల్లు, పాణ్యం, నంది కొట్కూరు, డోన్‌ మండలాల్లో 15వేల హెక్టార్లలో పత్తి పంట సాగవుతుంది.

వ్యాపారుల నుంచి పెద్దగా ఆశించలేం

అమెరికా, బ్రెజిల్‌, ఆస్ర్టేలియా, బ్రిటన్‌ దేశాధినేతలు తాము భారతదేశానికి సప్లయ్‌ చేసే పత్తిపై ఎటువంటి సుంకం వసూలు చేయరాదని ప్రదాని నరేంద్ర మోదీపై తీవ్ర ఒత్తిడి చేశాయి. దీంతో ప్రధాని దిగుమతి సుంకం విధింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. దీంతో మద్దతు ధర పెంచినా తమకు ఏం లాభం ఉంటుందని, తాము పండించే పత్తికి ఒకవైపు డిమాండ్‌ ఉండదని, మరో వైపు ధర కూడా వ్యాపారుల నుంచి పెద్దగా ఆశించలేమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉపసంహరణ దుర్మార్గం

కేంద్రప్రభుత్వం ఒకవైపు స్వదేశంలో రైతులు పండించే ఆహారోత్పత్తులు, ఇతర వాణిజ్య ఉత్పత్తులనే ప్రజలు వినియోగించాలని పిలుపునిస్తోంది. విదేశాల పాల కుల ఒత్తిళ్ల తలొగ్గి అక్కడి నుంచి మన దేశంలోకి దిగుమతయ్యే పంట ఉత్పత్తులకు విధిస్తున్న దిగుమతి సుంకాన్ని ఉపసంహరించుకోవడం దుర్మార్గమైన చర్య. కేంద్రం వెంటనే విదేశాల నుంచి దిగుమతయ్యే పత్తిపై దిగుమతి సుంకాన్ని కొనసాగించాల్సిందే.

జగన్నాథ, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఇప్పటి వరకు 11 శాతం వసూలు చేసేది

విదేశాల నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యే పత్తిపై కేంద్ర ప్రభుత్వం 11 శాతం సుంకాన్ని వసూలు చేసేది. ప్రస్తుతం దీన్ని ఉపసంహరించుకుంది. అక్టోబరు వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. రైతులకు పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. ప్రస్తుతం సాగైన పత్తి అక్టోబరులోనే రైతుల చేతికి అందుతుంది. అప్పుడు దిగుమతి సుంకం విధింపు కొనసాగే అవకాశం ఉంటుంది.

నారాయణమూర్తి, ఏడీఎం, మార్కెటింగ్‌ శాఖ, కర్నూలు

Updated Date - Jun 26 , 2026 | 11:19 PM