అవినీతిపై విచారణ జరపాలి
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:36 AM
రాయలసీమ యూనివర్సిటీ రిజిసా్ట్రర్ బోయ విజయకుమార్ నాయుడు అవినీతిపై విచారణ జరపాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
రిజిసా్ట్రర్‌కు వ్యతిరేకంగా పోస్టు కార్డు ఉద్యమం
కర్నూలు అర్బన్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): రాయలసీమ యూనివర్సిటీ రిజిసా్ట్రర్ బోయ విజయకుమార్ నాయుడు అవినీతిపై విచారణ జరపాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం వర్సిటీలో ఏఐఎస్‌ఏ రాష్ట్ర కార్యదర్శి ఎస్ నాగార్జున, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ శరత్ కుమార్, పీడీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడు కె. రమణ, ఆర్‌పీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజుల ఆఽధ్వర్యంలో ఉన్నత విద్యా మండలి ముఖ్య కార్యదర్శికి పోస్టు ద్వారా ఉత్తరాల పంపారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ రిజిష్ట్రార్ విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా పట్టించుకోకుండా, గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. టెండర్ల నియమా కాల్లో కూడా ముడుపులు దండుకున్నారని ఆరోపించారు. బీఈడీ కళాశాలల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అనుమతులు, కాన్వకేషన్ నిర్వ హణ, హాస్టల్ గదుల నిర్మాణాలు, టెండర్ల పేరుతో లక్షలాది రూపా యల నిధులు పక్క దారి మళ్లాయని, వాటిని ఆధారాలతో ఉన్నత విద్యామండలితోపాటు ఉపకులపతికి ఇచ్చినా ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు హరిష్, రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.