Share News

మధ్యాహ్న భోజనంలో అవినీతి తగదు

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:29 PM

పేద పిల్లలకు పెట్టే ఆహా రంలో అధికారులు అవినీతికి పాల్పడవద్దని ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ ప్రతాప్‌ రెడ్డి అన్నారు.

మధ్యాహ్న భోజనంలో అవినీతి తగదు
సీఎస్‌ఐ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌

నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

విద్యార్థుల సంఖ్యను పెంచాలి

ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ ప్రతాప్‌రెడ్డి

నందికొట్కూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): పేద పిల్లలకు పెట్టే ఆహా రంలో అధికారులు అవినీతికి పాల్పడవద్దని ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ ప్రతాప్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌ హాస్టల్స్‌, జడ్పీహె చ్‌స్‌(కోటా వీధి), జడ్పీహెచ్‌ఎస్‌(బాలికలు), సీఎస్‌ఐ ఉన్నత పాఠశాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని, ఎంఎల్‌ఎస్‌ గోదామును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ నియో జకవర్గంలోని హాస్టళ్లలో వసతులు పర్వాలేదన్నారు. వసతి గృహాలకు, పాఠశాలలకు 2కిలోమీటర్లు దూరం ఉన్న కారణంగా వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. ఆహారంలో ఉప్పు తక్కువగా ఉందని విద్యార్థులు ఫిర్యాదు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉప్మా బాగా ఉండడం లేదన్న ఫిర్యా దులు వస్తున్నాయని, సమ స్యను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కరి స్తామన్నారు. ప్రీమెట్రిక్‌ విద్యార్థులకు నెలకు రూ.1400, పోస్టుమెట్రిక్‌ విద్యార్థులకు రూ.18 00 ప్రభుత్వం ఇస్తోందన్నారు. రోజుకు రూ.43లకు టిఫిన్‌, భోజనం, చిక్కీలు, పాలు, స్నాక్స్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రూ.43కు ఈ మెనూ సాధ్యమవుతుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ నగదును పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎం ఎల్‌ఎస్‌ గోదాము నుంచి సరైన తూకాల్లో డీలర్లకు, అంగన్‌వాడీలకు, మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వాలని ఆయన సంబంధిత అధికారిని ఆదేశించారు.

Updated Date - Jul 03 , 2026 | 11:29 PM