Share News

ప్రతి పనికి వసూళ్లు

ABN , Publish Date - Sep 08 , 2026 | 11:30 PM

బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతి పనికి కళాశాల ప్రిన్సిపాల్‌ ముడుపులు వసూలు చేస్తున్నట్లు కళాశాల అధ్యాప కులు, కాంట్రాక్టు అధ్యాపకులు వాపోతున్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌గా లలిత పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆమె పైసలు వసూలుచేస్తూ అధ్యాపకులను, సిబ్బం దిని ఇబ్బంది పెడుతోంది. ఆమె అవినీతిని తట్టుకోలేక కొందరు అధ్యాపకులు బదిలీపై వెళ్లారు.

ప్రతి పనికి వసూళ్లు
బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇన్‌సెట్‌లో ప్రిన్సిపాల్‌ లలిత, కేశవరావు నాయక్‌ పేరుపై ఫోన్‌పే రసీదులు

చివరకు జీతాలు ఇవ్వాలన్నా ముడుపులే

మంత్రి బీసీకి అధ్యాపకుల ఫిర్యాదు

బనగానపల్లె, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతి పనికి కళాశాల ప్రిన్సిపాల్‌ ముడుపులు వసూలు చేస్తున్నట్లు కళాశాల అధ్యాప కులు, కాంట్రాక్టు అధ్యాపకులు వాపోతున్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌గా లలిత పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆమె పైసలు వసూలుచేస్తూ అధ్యాపకులను, సిబ్బం దిని ఇబ్బంది పెడుతోంది. ఆమె అవినీతిని తట్టుకోలేక కొందరు అధ్యాపకులు బదిలీపై వెళ్లారు. బదిలీపై వెళ్లాలంటే ఎల్‌వోసీ ఇవ్వడానికి కూడా రూ.10వేలు వసూలు చేసిందని తెలిపారు. ఓ అధ్యాపకుడికి సంబంధించి అరియర్స్‌ రావాలంటే కూడా సుమారు అధ్యాపకుడి నుంచి అధిక మొత్తంలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలివిగా ఆమె కేశవరావు నాయక్‌ పేరు మీదు ఫోన్‌పే ద్వారా డబ్బులు కొట్టించుకున్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా పనిచేసే సిబ్బంది నుంచి కూడా ముడుపులు వసూ లు చేసినట్లు తెలుస్తోంది. జీతాలు చేయాలంటే రెగ్యులర్‌ లెక్చరర్లు అయితే రూ.800, కాంట్రాక్టు అధ్యాపకులు అయితే రూ.600 ఫోన్‌పే కొడితేనే జీతాలు పెడుతున్నట్లు పక్కా ఆధారాలు ఉన్నాయి. అక్కడ పనిచేసే ఇంగ్లిషు అధ్యాపకురాలు జీతాల కోసం రూ.800 ఎందుకు ఇవ్వాలని అడిగినందుకు ఆమె సరిగా విధులు నిర్వహించలేదని మెమోలు ఇచ్చి భయపెట్టినట్లు అధ్యాపకురాలు ఆమె తెలిపారు. బదిలీ అయిన అధ్యాపకులు కూడా రూ.10వేలు ఇచ్చిన తర్వాతే రిలీవ్‌ చేసినట్లు బదిలీ అయిన అధ్యాపకులు పేర్కొంటున్నారు. అవినీతి పరాకాష్టకు చేరుకోవడంతో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి అధ్యాపకులు పక్కా ఆధారాలతో వినతిపత్రం సమర్పించారు. డిగ్రీ కళా శాల ప్రిన్సిపాల్‌ అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని ముడుపుల బాగోతం బయట పడనుంది. దీంతో ఆమెపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని మం త్రి బీసీ జనార్దన్‌రెడ్డి సంబంధిత అఽధికారులకు ఆదేశాలు జారీ చేసిట్లు తెలుస్తోంది.

ముడుపులు తీసుకోలేదు

నేను ఎవరి వద్ద ముడుపులు తీసుకోలేదు. కావాలనే నాపై నిందలు వేశారు. నేను నిజాయితీగా పనిచేస్తున్నా. కళాశాలలో పనిచేయని వారు సైతం నిందలు వేస్తున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధం. - ఎస్‌.లలిత, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బనగానపల్లె

Updated Date - Sep 08 , 2026 | 11:30 PM